ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి యువకుడు సాయి ప్రణీత్‌ను ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ సందర్భంగా మెచ్చుకున్నారు. సాయి ఏపీ వెదర్ మ్యాన్ పేరుతో వాతావరణ సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మన్ కీ బాత్ కార్యక్రమంలో సాయి ప్రణీత్ పేరును మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సోషల్ మీడియా సాయంతో రైతులకు ఆ యువకుడు అందిస్తున్న సేవలను మోదీ కొనియాడారు. సాయి ప్రణీత్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజీనీర్‌గా పని చేస్తున్నాడు. గత ఏడేళ్లుగా వాతావరణ అంశాలను విశ్లేషిస్తూ ఐఎండీ, ఐక్యరాజ్య సమితి నుంచి మన్నలు పొందారు. ఈ క్రమంలో సాయి ప్రణీత్ అందిస్తున్న సేవలను తెలుసుకుని మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా మోదీ ప్రస్తావించారు.