Skip to main content

Namaste NRI

సుస్వర తరంగ్ హీరోగా మూవీ ప్రారంభం

ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌ తనయుడు సుస్వర తరంగ్‌ హీరోగా పరిచయమవుతున్నాడు. సురవి విజన్స్‌ ప్రొడక్షన్‌ పతాకంపై వీరేష్‌ కోకా దర్శకత్వంలో పి.చక్రధర రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దివ్యాని మొండల్‌ కథానాయికగా నటిస్తున్నది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు డాలీ క్లాప్‌నిచ్చారు.

నేటి యువతరం ఆలోచనల్ని ప్రతిబింబించే కథాంశమిదని, ఈ సినిమా ద్వారా తమ అబ్బాయికి మంచి పేరొస్తుందనే నమ్మకం ఉందని వందేమాతం శ్రీనివాస్‌ అన్నారు. నిజజీవిత సంఘటనల ఆధారంగా ఈ కథ రాసుకున్నా. అన్ని కమర్షియల్‌ అంశాలుంటాయి. హైదరాబాద్‌, వైజాగ్‌లలో చిత్రీకరణ జరుపుతాం అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: యస్‌.చంద్రశేఖరన్‌, సంగీతం: బిబిన్‌ అశోక్‌, దర్శకత్వం: వీరేష్‌ కోకా.

Social Share Spread Message

Latest News