Skip to main content

Namaste NRI

నా.. నీ ప్రేమ కథ ట్రైలర్‌ను లాంచ్ చేసిన మంత్రి తలసాని

ఆముద శ్రీనివాస్‌ కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం  నా..నీ ప్రేమకథ. కారుణ్య చౌదరి కథానాయిక. ప్రోత్నాక్‌ శ్రవణ్‌కుమార్‌ నిర్మాత. ఇటివలే విడుదలైన ఈ చిత్రం టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను  తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంచ్ చేశారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ట్రైలర్‌ బాగుంది. హీరోగా, దర్శకునిగా శ్రీనివాస్‌ మంచి ప్రతిభను కనబరిచారు. ఈ ట్రైలర్‌ చూస్తుంటే సినిమా కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం కలిగింది. ఈ సినిమా భారీ విజయం సాధించి అందరికి మంచి పేరును తీసుకురావాలి అన్నారు. ఈ చిత్రానికి ఎంఎస్ కిరణ్ కుమార్ కెమరామెన్ గా పని చేస్తున్నారు. ఎంఎల్ పి రాజా సంగీతం సమకూరుస్తుండగా చిన్నా నేపధ్య సంగీతం అందిసస్తున్నారు. నందమూరి హరి ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News