Namaste NRI

సైమ‌న్‌గా నాగార్జున..కుబేర నుంచి కొత్త పోస్టర్ రిలీజ్

త‌మిళ న‌టుడు ధనుష్‌ కథానాయకుడిగా రూపొందుతోన్న తాజా చిత్రం కుబేర. శేఖర్‌ కమ్ముల ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం. రష్మిక మందన్న కథానాయికగా న‌టిస్తుంది. అయితే ఈ సినిమాలో టాలీవుడ్ అగ్ర న‌టుడు అక్కి నేని నాగార్జున ప్రత్యేకపాత్ర పోషిస్తున్నారు. అయితే నాగార్జున పుట్టిన‌రోజు సంద‌ర్భంగా కుబేరా టీం విషెస్ తెలుపుతూ.. కుబేర మూవీ నుంచి నాగార్జున కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ పోస్ట‌ర్‌లో హ్యాపీ బ‌ర్త్‌డే కింగ్ అంటూ చిత్ర‌బృందం రాసుకోచ్చింది. ఈ పోస్ట‌ర్ చూస్తే,  కింగ్ ఎవ‌రికో హైఫై ఇస్తున్న‌ట్లుగా పోస్ట‌ర్ ఉంది. సునీల్‌ నారంగ్‌, పుస్కుర్‌ రామ్మోహన్‌రావు కలిసి నిర్మిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, కెమెరా: నికేత్‌ బొమ్మి, నిర్మాతలు: సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు.

Mayfair 147

ఇదిలావుంటే తాజాగా ర‌జ‌నీకాంత్ కూలీ నుంచి కింగ్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. త‌మిళ అగ్ర ద‌ర్శ‌కుడు లోకేష్ కనగ‌రాజ్‌ సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్‌లో వ‌స్తున్న తాజా చిత్రం కూలీ. సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధిమారన్ ఈ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తుండ‌గా,  తలైవ కెరీర్‌లో ఇది 171వ సినిమా. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఈ చిత్రం ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. అయితే ఈ మూవీలో అక్కినేని నాగార్జున ఒక కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఆ వార్త‌ల‌ను నిజం చేస్తూ కూలీ నుంచి నాగార్జున ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఈ మూవీలో నాగార్జున సైమ‌న్‌ అనే పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్లు లోకేష్ అనౌన్స్ చేశాడు. అయితే ఈ మూవీలో త‌లైవ‌ర్‌ను ఢీ కొట్టే పాత్ర‌లో నాగార్జున న‌టించ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. ఒక వేళ ఇదే నిజ‌మైతే అటు ర‌జినీ ఫ్యాన్స్‌తో పాటు ఇటు నాగ్ ఫ్యాన్స్ పండ‌గ అని చెప్పుకోవాలి.

Ixora 148
Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events