Namaste NRI

తనకు ఎలాంటి ఆంక్షలూ విధించను .. నేను అలాగే బ్రతికాను

స్త్రీ స్వేచ్ఛ అనే అంశంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది బాలీవుడ్‌ భామ కైరా అద్వానీ. ఈ నేపథ్యంలో ఏడాది కూడా నిండని తన కుమార్తె సరయు భవిష్యత్‌ గురించి మాట్లాడుతూ షాకింగ్‌ కామెంట్లు చేసింది. కైరా మాట్లాడుతూ స్త్రీకి స్వేచ్ఛ అవసరం. కట్టుబానిసగా బతకాల్సిన అవసరం స్త్రీకి లేదు. పెళ్లయినా, డేటింగ్‌ అయినా ఆమె ఇష్టంతో జరగాలి. నేను అలాగే బ్రతికాను. సరైన వ్యక్తిని ఎంచుకునే క్రమంలో చాలామందితో డేటింగ్‌ చేశాను. చివరకు సరైన వ్యక్తి దొరికాడు. ఎదిగే క్రమంలో ప్రతి అనుభవం ఒక పాఠమే. అవే మనల్ని మనిషిగా మారుస్తాయి. పొరపాట్లు మానవసహజం. వాటిని దిద్దుకుంటూ ముందుకు సాగడమే జీవితం. నా కూతురు సరయు విషయంలోనూ నేను ఇదే పంథా అనుసరిస్తా. నాలాగే తనూ జీవిస్తుంది. ఈ క్రమంలో తనకు ఎలాంటి ఆంక్షలూ విధించను అంటూ చెప్పుకొచ్చింది కైరా.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events