Namaste NRI

అమెరికాలో గౌతమ్‌ అదానీకి ఊరట!

భారత్‌లో సోలార్‌ ఎనర్జీ కాంట్రాక్టులు దక్కించుకొనేందుకు ఇక్కడి అధికారులకు 265 మిలియన్‌ డాలర్లకు పైగా లంచాలు ఇవ్వజూపారన్న కేసులో వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీకి ఊరట లభించింది. ఈ కేసులో అదానీపై మోపిన క్రిమినల్‌, సివిల్‌ ఫ్రాడ్‌ అభియోగాలను ఉపసంహరించుకోవడానికి అమెరికా సిద్ధమైంది. ఈ మేరకు యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌తో పాటు యూఎస్‌ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సేంజ్‌ కమిషన్‌ (ఎస్‌ఈసీ) కేసులను వెనక్కి తీసుకోనున్నట్టు తెలిసిందే. దీనికి సంబంధించి ఈ వారంలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది.

కాగా ఈ స్కామ్‌లో అదానీకి నోటీసులు జారీచేయడానికి తమకు సాయం చేయడం లేదంటూ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై ఎస్‌ఈసీ గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదానీపై ఉన్న ఈ కేసును అమెరికా అధికారులు ఉపసంహరించుకోవడంపై పెద్దయెత్తున చర్చ జరుగుతున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events