తమిళ హీరోయిన్ నమిత దంపతులు తిరుమల వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం తాను నటిస్తున్న భౌభౌ సినిమా షూటింగ్ పూర్తయ్యింద అన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఆ సినిమాను థియేటర్స్‌లో విడుదల చేయాలా? లేకపోతే ఓటీటీలో రిలీజ్ చేయాలా అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలిపారు. త్వరలో నమిత ఫిల్మ్ ఫ్యాక్టరీ, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్, నమితి సినిమా థియేటర్‌ను ప్రారంభిస్తున్నట్టు వెల్లడిరచారు. జేఈవోగా శ్రీనివాసరాజు ఉన్న సమయంలో ఆలయ అడ్మినిస్ట్రేషన్ బాగుందని, ఇప్పుడు అంతా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని నమిత అసహనాన్ని వ్యక్తపరిచారు.