Namaste NRI

కమల్‌హాసన్‌ సరసన నయనతార ?

కమల్‌హాసన్‌ కథానాయకుడిగా మణిరత్నం కలయికలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. కమల్‌హాసన్‌ 234 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్ర నిర్మాణంలో కమల్‌హాసన్‌, మణిరత్నం సైతం భాగస్వాములవుతున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతున్నది.  కథానుగుణంగా ఈ చిత్రంలో ఇద్దరు నాయికలకు చోటుందని తెలిసింది. అందులో ఓ హీరోయిన్‌గా త్రిష పేరును ఖరారు చేశారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో నయనతారను మరో నాయికగా ఎంపిక చేశారని తెలిసింది. ఈ విషయమై త్వరలో అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

Social Share Spread Message

Latest News