Namaste NRI

డొనాల్డ్ ట్రంప్ కొత్త అవతారం!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. దేశాధ్యక్షుడు, రాజకీయ నాయకుడు, బహుముఖ వ్యాపారవేత్తగా ఆయన అందరికి పరిచితమే. సెప్టెంబర్‌ 11న జరుగనున్న బాక్సింగ్‌ పోటీలకు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. మాజీ హెలీవెయిట్‌ ఛాంపియన్‌ ఇవాండర్‌ హోలీఫీల్డ్‌, మాజీ యూఎఫ్‌సీ ఛాంపియన్‌ విక్టర్‌ బెల్‌ఫోర్ట్‌ మధ్య జరుగనున్న బ్యాక్సింగ్‌ పోటీకి తనయుడు జూనియర్‌ ట్రంప్‌తో కలిసి వ్యాఖ్యానం చేయనున్నాడు. ఈ పోటీకి ఫ్లోరిడాలోని హాలీవుడ్‌ ఎరీనా వేదిక కానుంది. నాలుగు బౌట్ల పాటు సాగే ఈ పోటీని పే పర్‌ వ్యూ విధానం ద్వారా FITE.TV  ప్రసారం చేయనుంది.

                 మొబైల్‌, స్మార్ట్‌ టీవీ యాప్స్‌లో ప్రసారమయ్యే ఈ ఫైట్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలంటే 49.9 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. కాగా దిగ్గజాలు తలపడే ఈ పోరు సందర్భంగా వ్యాఖ్యానం చేసేందుకు ట్రంప్‌ సహా అమెరికన్లు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని మీరెవ్వరూ మిస్సవ్వొద్దు అని డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు.

Social Share Spread Message

Latest News