Skip to main content

Namaste NRI

ఆగస్టు 15న తెలంగాణలో ఒక కోటి 5 లక్షల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ

రాష్ట్రంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆగస్టు 15న సంగారెడ్డి కేంద్రంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శ్రీకారం. వెంటనే 119 నియోజకవర్గాల్లో ఏకకాలంలో పంపిణీ కార్యక్రమం.వాటర్‌ప్రూఫ్‌, క్రెడిట్ కార్డు పరిమాణంలో లామినేటెడ్ కార్డు పంపిణీ.’స్మార్ట్’ కార్డులపై క్యూఆర్ కోడ్‌తోపాటు ఆధునిక భద్రతా ప్రమాణాలు కలిగి ఉంటుంది. ఆగస్టు 15న దేశవ్యాప్తంగా జరుపుకునే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఈ వినూత్న కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు.

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించే అధికారిక పతాకవిష్కరణ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్డులను లబ్ధిదారులకు స్వయంగా అందజేసి పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి కూడా పాల్గొననున్నారు. తొలి విడతలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు కార్డులు ఇచ్చి, తదుపరి దశలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని  జిల్లాల్లో పంపిణీ చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News