Namaste NRI

జీవితకాలం విషయంలో కొత్త రికార్డులు.. జార్జియా యూనివర్సిటీ 

జీవితకాలం విషయంలో మనుషులు పాత రికార్డులు చెరిపేసి కొత్త రికార్డులు సృష్టించబోతున్నారని జార్జియా యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. 1910 నుంచి 1950 మధ్య జన్మించిన వారు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని, వీరిలో పురుషులు 141 ఏండ్ల వరకు, మహిళలు 130 ఏండ్ల వరకు జీవించవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. 19 దేశాల్లో వృద్ధుల వయసు, మరణాలను అధ్యయనం చేసిన తర్వాత పరిశోధకులు ఈ విషయాలను గుర్తించారు. 1910 నుంచి 1950 మధ్యకాలంలో పుట్టిన వారి జీవితకాలం పెరిగిందని తేల్చారు. ప్రస్తుతం వైద్యరంగం పురోగతి, పౌష్టికాహారం లభ్యమవుతున్న నేపథ్యంలో ప్రజలు జీవించే వయసు రానున్న దశాబ్దాల్లో పెరుగుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. కాగా, ఇప్పటివరకు ఉన్న రికార్డుల ప్రకారం ఫ్రెంచ్‌ మహిళ జీన్‌ కాల్మెంట్‌ అత్యధిక కాలం జీవించారు. ఆమె 122 ఏండ్ల 164 రోజులు బతికారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events