Skip to main content

Namaste NRI

గ్రీస్ లో కొత్త నిబంధన… టీకా తీసుకోకపోతే ప్రతి నెల

60 ఏళ్లు దాటిన వారిలో టీకా తీసుకోని వారు ప్రతీ నెలా  100 యూరోలు (సుమారు రూ.8,500) జరిమానా కట్టాల్సిందేనంటూ గ్రీస్‌ సర్కారు హుకుం జారీ చేసింది. ఈ నిబంధన తక్షణమే అమలు కానుంది. వైద్య రంగంపై ఒత్తిడి తగ్గించడమే గ్రీస్‌ సర్కారు చర్య వెనుకనున్న ఉద్దేశ్యం. ప్రధాని కిరి యాకోస్‌ మిట్సోటకిస్‌ ఈ మేరకుప్రజలకు సందేశం ఇచ్చారు. 60 ఏళ్లు దాటిన వారిలో టీకా తీసుకోని వారు వెంటనే తీసుకోవాలి. ఫైన్‌ వేయడానికి ఎంతో సమయం పట్టదు. కానీ, మీ జీవితాలను, మీరు ఎంతగానో ప్రేమించే వారిని కాపాడుకోండి. టీకా సురక్షితమేనని అర్థం చేసుకోండి అని పిలుపునిచ్చారు.  టీకాలు తీసుకోని వారు వైరస్‌ బారిన పడితే హాస్పిటల్లో చేరాల్సిన రిస్క్‌ ఎక్కువగా ఉంటోందని గ్రీస్‌ అధికారులు చెబుతున్నారు.

Social Share Spread Message

Latest News