Skip to main content

Namaste NRI

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో  నిక్కీ హేలీ

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున బరిలో దిగుతున్నట్లు భారత సంతతి  మహిళ నిక్కీ హేలీ ప్రకటించారు. ఈనెల 15 నుంచి సౌత్ కరోలినాలోని  చార్లెస్టన్ నుంచి ప్రచారం ప్రారంభిస్తానని భారతీయ అమెరికన్ తెలిపారు. ఇక ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ నుంచి మరోసారి తాను బరిలోకి దిగుతున్నట్లు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరి మధ్య పోటీ జరగనుంది. తాజా పరిణామంతో తన మాజీ బాస్ ట్రంప్కు నిక్కీ ఏకైక ప్రత్యర్థిగా నిలవనున్నారు. ఇక అమెరికా అధ్యక్ష బరిలో నిలవబోతున్న మూడో భారతీయ అమెరికన్ నిక్కీ. ఇంతకుముందు 2015లో లూసియానా గవర్నర్గా పనిచేసిన బాబీ జిందాల్ , 2020లో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడ్డారు. కానీ, చివరి నిమిషంలో కమలా తప్పుకున్నారు. దాంతో జో బైడెన్కు  మార్గం సుగమమైంది.

Social Share Spread Message

Latest News