Namaste NRI

నిక్కీ హేలీ కీలక ప్రకటన…నా ఓటు ఆయనకే

రిపబ్లికన్‌ పార్టీ   కీలక నేత, భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ   కీలక ప్రకటన చేశారు. మొన్నటి వరకూ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్‌ పార్టీ తరఫున డొనాల్డ్‌ ట్రంప్‌ కు గట్టి పోటీనిచ్చిన హేలీ,  ఇప్పుడు ఆయనకే జై కొట్టారు. నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో  మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కే తన మద్దతు అని ప్రకటించారు. అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటు ట్రంప్‌కే అని స్పష్టం చేశారు. వాషింగ్టన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో హేలీ ఈ ప్రకటన చేశారు. విధానాల విషయంలో డొనాల్డ్ ట్రంప్ పరిపూర్ణంగా కనిపించడంలేదు. ఇదే విషయాన్ని నేను చాలాసార్లు స్పష్టంగా చెప్పాను. ట్రంప్ విధానాలు సంపూర్ణంగా లేకపోయినప్పటికీ ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ మాత్రం ఓ విపత్తు. కాబట్టి నేను ట్రంప్‌కే మద్దతిస్తా. నా ఓటు ఆయనకే  అని హేలీ స్పష్టం చేశారు.

రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో డొనాల్డ్‌ ట్రంప్‌కు నిక్కీ హేలీ గట్టి పోటీ ఇచ్చిన విషయం తెలిసిందే. కొన్ని నెలలపాటు ట్రంప్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రైమరీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇద్దరూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు. దీంతో ఎన్నికల సమయంలో రిపబ్లికన్‌ పార్టీ రెండుగా చీలిపోతుందని అంతా ఊహించారు. అయితే, అనూహ్యంగా రెండు నెలల క్రితం అధ్యక్ష రేసునుంచి తప్పుకుంటున్నట్లు హేలీ ప్రకటించారు. ఆ తర్వాత అధ్యక్ష ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇస్తారన్న విషయంపై గత కొంతకాలంగా మౌనంగా ఉన్న హేలీ ఎట్టకేలకు ట్రంప్‌కే జై కొట్టారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UULmVdT0LRtF67ZbuX2dEeQQ&layout=gallery[/embedyt]