Skip to main content

Namaste NRI

జూనియర్ ఆర్టిస్ట్‌గా నితిన్..అదిరిపోయిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ టీజర్

నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఎక్స్‌ట్రా-ఆర్డినరీ మ్యాన్‌. శ్రీలీల కథానాయిక. వక్కంతం వంశీ దర్శకుడు. సుధాకర్‌ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. ఈ సినిమా టీజర్‌ ను విడుదల చేశారు. ఇందులో హీరో నితిన్‌ను జూనియర్‌ ఆర్టిస్ట్‌ పాత్రలో పరిచయం చేశారు.  బాహుబలి-2 దండాలయ్య పాటలో నాలుగో వరుసలో ఓ జూనియర్‌ ఆర్టిస్టుగా కనిపిస్తానని నితిన్‌ చెప్పడం, అందుకు కౌంటర్‌గా అతని తండ్రి రావు రమేష్‌ జూనియర్‌ ఆర్టిస్టువి, నీ కెందుకురా ఇన్ని ఎక్స్‌ట్రాలు అంటూ సైటెర్‌ వేయడం చక్కటి వినోదాన్ని పంచింది. యాక్షన్‌, కామెడీ ప్రధానంగా టీజర్‌ ఆకట్టుకుంది. ఆద్యంతం హాస్యప్రధానంగా సాగే చిత్రమిదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి హారిస్‌ జైరాజ్‌ సంగీతాన్నందిస్తున్నారు.  

Social Share Spread Message

Latest News