Namaste NRI

క్రిస్మస్ కానుకగా నితిన్‌ రాబిన్‌ హుడ్‌

నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం రాబిన్‌హుడ్‌. వెంకీ కుడుముల దర్శకత్వం.  మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నితిన్‌ స్పోర్ట్స్‌ బైక్‌ మీద కూర్చొని స్టెలిష్‌గా ఉన్నారు. ఈ సినిమాలో నితిన్‌ దొంగ పాత్రలో కనిపిస్తారని,  హ్యూమరస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకుంటుందని, నితిన్‌ క్యారెక్టర్‌ టీజర్‌కు మంచి స్పందన లభించిందని చిత్ర బృందం పేర్కొంది. రాజేంద్రప్రసాద్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు నటిస్తున్నారు.  ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 20న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సాయిశ్రీరామ్‌, సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్‌, ఆర్ట్‌: రామ్‌కుమార్‌, రచన-దర్శకత్వం: వెంకీ కుడుముల.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress