Skip to main content

Namaste NRI

బీహార్‌ సీఎంగా నితీశ్‌ కుమార్‌ ప్రమాణ స్వీకారం

బీహార్‌ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో 10వ సారి నితీశ్‌ కుమార్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గురువారం గాంధీమైదాన్‌లో గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, పలు ఎన్డీఏ పాలిత రాష్ర్టాల సీఎంలు హాజరయ్యారు. 74 ఏండ్ల నితీశ్‌తో పాటు 26 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. వీరిలో 14 మంది బీజేపీ నుంచి, 8 మంది జేడీ(యూ), ఇద్దరు జనశక్తి పార్టీ (రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌), హిందుస్థానీ అవామ్‌ మోర్చా (హెచ్‌ఏఎం), రాష్ట్రీయ లోక్‌ మోర్చా (ఆర్‌ఎల్‌ఎం) నుంచి ఒక్కొక్కరు ఉన్నారు.

Social Share Spread Message

Latest News