Skip to main content

Namaste NRI

భారతీయులకు నో చాన్స్‌.. 2028 వరకు అనుమతి నిరాకరణ

అమెరికా డైవర్సిటీ వీసా (డీవీ) లాటరీ నుంచి భారతీయులను 2028 వరకు అమెరికా మినహాయించింది. ఈ డీవీ లాటరీని గ్రీన్‌ కార్డు లాటరీగా కూడా వ్యవహరిస్తారు. గడచిన ఐదు సంవత్సరాలకు పైగా అమెరికాకు తక్కువ సంఖ్యలో ప్రజలు వలస వచ్చిన దేశాల నుంచి అందిన దరఖాస్తులలో 50,000 మంది వరకు ఈ ప్రోగ్రామ్‌ కింద ఇమిగ్రెంట్‌ వీసాలను అమెరికా మంజూరు చేస్తుంది. అయితే భారత్‌ ఈ పరిమితిని దాటేసింది. భారతీయులకు మంజూరైన ఇమిగ్రెంట్‌ వీసాల సంఖ్య గడచిన ఐదేళ్లుగా పరిమితికి మించి ఉండడంతో 2028 వరకు భారతీయులకు ఈ లాటరీ ద్వారా వీసాలు పొందే అర్హతను కోల్పోయారు.

గడచిన ఐదేళ్లలో 50,000కు మించి ఇమిగ్రెంట్లను అమెరికాకు పంపిన కారణంగా డీవీ లాటరీ నుంచి భారత్‌ను తప్పించినట్లు తెలుస్తోంది. 2021లో 93,450 మంది భారతీయులు అమెరికాకు వలసలు పోగా 2022లో ఈ సంఖ్య 1,27,010కి పెరిగింది. 2023లో 78,070 మంది భారతీయులు అమెరికాకు వలస పోయారు. భారత్‌తోపాటు చైనా, దక్షిణ కొరి యా, కెనడా, పాకిస్థాన్‌ను కూడా డీవీ లాటరీ నుంచి తప్పించే అవకాశం కనపడుతోంది.

Social Share Spread Message

Latest News