అగ్రరాజ్యం అమెరికాలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల విస్ఫోటంతో ఆరోగ్య వ్యవస్థ కుదేలవుతుంది. కరోనా కొత్త కేసులు రోజుకు 5 లక్షల చొప్పున నమోదవుతున్నాయి. చిన్నపిల్లలు కూడా ఎక్కువ సంఖ్యలో దవాఖానల్లో చేరాల్సి వస్తున్నది. ఐసీయూలు 78 శాతం రోగులతో నిండిపోయాయని అమెరికా ఆరోగ్య, మానవ సేవల విభాగం తెలిపింది. గత రెండేండ్లుగా అమెరికాలో కొవిడ్ బారిన పడిన మొత్తం రోగుల సంఖ్య 5.25 కోట్లు. మరణాల సంఖ్య 8 లక్షలకు చేరుకుంది. రోగులతో దవాఖానల అత్యవసర విభాగాలు నిండిపోవడంతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీ వైద్య విభాగం అధిపతి జేమ్స్ ఫిలిప్స్ వెల్లడిరచారు.














