Skip to main content

Namaste NRI

వందేండ్లలో ఇలాంటి సంక్షోభాన్ని చూడలే

ప్రపంచవ్యాప్తంగా జీవన వ్యయం (రోజువారీ ఖర్చు) బాగా పెరిగిందని ఐక్యరాజ్యసమితి తన నివేదికలో వెల్లడిరచించింది. రష్యా`ఉక్రెయిన్‌ యుద్ధంతో వందేండ్లలో ఇలాంటి సంక్షోభాన్ని చూడలేదని పేర్కొన్నది. దీన్ని తట్టుకొనే సామర్థ్యం ప్రజలకు లేదని ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌ యుద్ధం ప్రపంచం మీద పెద్ద బండ ఎత్తేసిందని, ప్రజలు నలిగిపోతున్నారని యూఎన్‌ నివేదికలో పేర్కొన్నది. పెరుగుతున్న ఆహార, చమురు, ఎరవుల ధరలే ఆ రాయి అని తెలిపింది.  ఎఫ్‌ఏలో ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఆహార ద్రవ్యోల్బణం 20.8 శాతం ఉన్న విషయాన్ని ప్రాస్తావించింది. యుద్ధం కారణంగా చమురు ధరలు పెరిగాయి. ఫలితంగా రవాణా వ్యయం పెరిగింది. ఎరువుల ధరలు పెరిగాయి. ఆహార ఉత్పత్తి వ్యయం పెరిగింది. జీవన వ్యయం పెరిగింది. ప్రపంచ  ఆర్థిక వ్యవస్థ విషవయంలోకి వెళ్తున్నది అని పేర్కొన్నది. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం ప్రపంచంపై ప్రభావంకు సంబంధించిన యూఎన్‌ విడుదల చేసిన రెండో నివేదిక ఇది.

Social Share Spread Message

Latest News