Skip to main content

Namaste NRI

పాక్ ప్రధాని సంచలన ప్రకటన.. వింటర్ ఒలింపిక్స్ లో

బీజింగ్‌లో జరగనున్న వింటర్‌ ఒలింపిక్స్‌ ఆరంభ వేడుకలకు తాను హాజరవుతున్నట్లు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రకటించారు. దీని కోసం తాను చైనాకు వెళ్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 3 నుంచి 6వ తేదీ వరకు చైనాలో పర్యటిస్తున్నానని ఇమ్రాన్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఒలింపిక్స్‌ ఆరంభ వేడుకల్లో పాల్గొంటానని, చైనా అద్యక్షుడు జిన్‌ పింగ్‌, ప్రధాని లి కెక్వియాంగ్‌తో సమావేశమవుతానని వెల్లడిరచారు. ఇరు దేశాల వాణిజ్యపరమైన, రక్షణ, తదితర అంశాలను చర్చించనున్నట్లు తెలిపారు.     

        వింటర్‌ ఒలింపిక్స్‌కు బీజింగ్‌ ఆతిథ్యం ఇస్తున్నది. ఫిబ్రవరి 4న ఆరంభ వేడుకలను ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్నది. ఇందులో ఆ దేశ అధ్యక్షుడితో పాటు ప్రభుత్వ పెద్దలు పాల్గొననున్నారు.  వీరితో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, ఐక్యారాజ్య సమితి సెక్రెటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ సహా వివిధ దేశాలకు చెందిన 32 మంది నాయకులు పాల్గొంటారని ప్రభుత్వం వెల్లడిరచింది.

Social Share Spread Message

Latest News