ఇరాన్‌తో లింకులు ఉన్న పాకిస్థానీ జాతీయుడిని అమెరికా అరెస్టు చేసింది. అమెరికా రాజకీయవేత్తలను హత్య చేసేందుకు ఆ పాక్ వ్యక్తి ప్లాన్ వేసినట్లు న్యూయార్క్ ఫెడరల్ కోర్టు పేర్కొన్నది. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌ను హత్య చేసేందుకు అతను ప్లాన్ వేసినట్లు అనుమానిస్తున్నారు. పాక్‌కు చెందిన అసిఫ్ రాజా మెర్చంట్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై అభియోగాలు నమోదు అయినట్లు అమెరికా అటార్నీ జనరల్ మెర్రిక్ గార్లాండ్ తెలిపారు. జనరల్ ఖాసిమ్ సోలేమాని హత్య తర్వాత అమెరికా ప్రభుత్వాధికారులపై ఇరాన్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోందన్నారు. పాకిస్థాన్ జాతీయుడైన అసిఫ్ రాజా కిరాయి హత్యలకు పాల్పడేం దుకు సిద్దమైనట్లు ఎఫ్‌బీఐ చీఫ్ క్రిస్టోఫర్ వ్రే తెలిపారు.