మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఐదు దేశాల్లో ఏర్పాటు చేయాలని ఇండియన్, తెలుగు సంస్థల ప్రతినిధుల సన్నాహక సమావేశం వెల్లడిరచింది. శత జయంతి ఉత్సవాల కమిటీ సభ్యుడు బిగాల మశేశ్ గుప్తా ఆధ్వర్యంలో అమెరికాలోని అట్లాంటాలో పీవీ విగ్రహం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. అట్లాంటాలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మహేశ్ బిగాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ ఆలోచన మేరకే పీవీ శత జయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహించుకున్నట్టు తెలిపారు. పీవీ విగ్రహాల ఏర్పాటు ప్రతిపాదనలో భాగంగా ఇప్పటికే అమెరికాలో అట్లాంటాలో స్థల పరిశీల జరిగిందన్నారు. రానున్న రోజుల్లో ఎంపీ కేశవరావుతో చర్చించి నవంబర్‌లో పీవీ విగ్రహాలు ఏర్పాటు చేసే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు.
విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని తెలంగాణ నుంచి ప్రముఖులను, పీవీ కుటుంబ సభ్యులను ఆహ్వానిస్తామన్నారు. ఎన్నారై సంస్థల సభ్యులు కూడా పీవీకి భారతరత్న ప్రదానం చేయాలని కోరుతున్నట్టు తెలిపారు. ఐఏసీఏ వ్యవస్థాపక సభ్యుడు పాడిశర్మ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి, అమెరికన్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్ అక్సినేని, ఐఎఫ్‌ఏ చైర్మన్ సునీల్ సవిలి, టీఆర్‌ఎస్ పార్టీ అట్లాంటా సలహాదారు రామడుగు శివకుమార్, జనార్దన్ పన్నెల, సందీప్ గుండ్ల, గణేశ్, శ్రీనివాసులు రామిశెట్టి, కీర్తిధర్ గౌడ్ చకిలం పాల్గొన్నారు.