Skip to main content

Namaste NRI

పొన్నియన్‌ సెల్వన్‌ తీయటం గర్వంగా ఉంది

ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకతం వహిస్తున్న ప్రెస్టీజీయస్‌ సినిమా పొన్నియన్‌ సెల్వన్‌ లైకా ప్రొడక్షన్స్‌. మెడ్రాస్‌ టాకీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  విక్రమ్‌, జయంరవి, కార్తీ, ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌, త్రిష, ఐశ్వర్య లక్ష్మీ శరత్‌కుమార్‌, విక్రమ్‌ ప్రభు, శోబిత దూళిపాళ్ల, జయరామ్‌, ప్రభు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి చోళ చోళ అనే పాటను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తనికెళ్ల భరణి, ప్రకాష్‌ రాజ్‌, చియాన్‌ విక్రమ్‌, కార్తీ నాజర్‌, దిల్‌రాజు సుహాసిని తదితరులు మాట్లాడారు. మణిరత్నం మాట్లాడుతూ చిరంజీవి గారికి థాంక్స్‌ చెప్పాలన్నారు. కానీ అది ఎందుకు అనేది చెప్పను అన్నారు.  తర్వాత మీకే తెలుస్తోందన్నారు. రాజమౌళి గారికి థాంక్స్‌ చెప్పాలన్నారు. ఆయన వల్లే ఇలాంటి చిత్రాలు తీయగలమనే దైర్యం వచ్చింది. రెండు పార్టులుగా  ఇలాంటి చిత్రాలు తీసి మెప్పించవచ్చని నిరూపించారు. అందుకే ఆయనకు థాంక్స్‌ అన్నారు. నాబిడ్డలాంటి ఈ చిత్రం ఇక దిల్‌రాజుగారిదే అన్నారు. ఆయనే తెలుగులో ఈ సినిమాను చూసుకోవాలని అన్నారు. తనికెళ్ల భరణిగారికి థాంక్స్‌ అన్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు.పొన్వినయన్‌సెల్వన్‌, పిఎస్‌1న ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్‌ 30న విడుదల చేసయటానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళ, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ  సినిమాను ఏకకాలంలో విడుదల చేయనున్నారు.

Social Share Spread Message

Latest News