వెంకటేష్, వరుణ్‌తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఎఫ్3. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ ఉండనుందని తెలిసిందే. అంయితే ఈ పాట కోసం పూజాహెగ్డేను యూనిట్ సంప్రదించిందని తెలిసింది. అందుకే ఆమె ఓకే అనటంతో తాజాగా సెట్స్‌లోకి జాయిన్ అయ్యింది. ఈ చిత్రంలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ కోసం భారీగా పారితోషికం తీసుకున్నట్టు తెలిసింది. అంతేకాకుండా మంచి స్టెప్పులతో ఈ పాట ఉండనుందని తెలిసింది. ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఎఫ్`3 చిత్రం మే 27న ప్రేక్షకుల ముందుకురానుంది. రాజేంద్రప్రసాద్, సునీల్, సోనాల్‌చౌహాన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం : దేవీశ్రీ ప్రసాద్, సహనిర్మాత: హర్షిత్ రెడ్డి, దర్శకత్వం: అనిల్ రావిపూడి.














