Namaste NRI

మిరాయ్ నుంచి మంచు మనోజ్ పవర్ ఫుల్ గ్లింప్స్

మంచు మనోజ్‌ నటిస్తున్న చిత్రం మిరాయ్‌. ఈ చిత్రానికి కార్తిక్‌ ఘట్టమనేని దర్శకుడు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు.  ఇందులో మనోజ్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రంలోని మనోజ్‌ లేటెస్ట్‌ అవతార్‌ని మేకర్స్‌ రివీల్‌ చేస్తూ, మంచు మనోజ్‌ ది బ్లాక్‌ స్వార్డ్‌ గా ఫస్ట్‌లుక్‌ గ్లింప్‌ను హైదరాబాద్‌లో లాంచ్‌ చేశారు. ఈ గ్లింప్‌లో మనోజ్‌ అత్యంత పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. మనోజ్‌ మాట్లాడుతూ దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ వెండితెరపైకి వస్తున్నాను. ఏదైనా కొత్తగా డిఫరెంట్‌గా చేయడం నాకిష్టం. అందుకే డబ్బుకోసం కాకుండా నచ్చిన సినిమాలనే వెతుక్కుంటూ వెళ్లాను. మళ్లీ సినిమా ను చేయాలనుకున్నప్పుడు చాలా కథలు విన్నాను. ఓపికగా ఎదురు చూశాను. అలాంటి సమయంలో దర్శకుడు కార్తీక్‌ ఈ కథ చెప్పాడు అని తెలిపారు.

 తేజ సజ్జాకి థ్యాంక్స్‌ చెప్పాలి. ఈ సినిమాలో నువ్వు, నేను చేయాలి అన్నా కథ విను  అని అడిగాడు. ముచ్చట గా అనిపించింది. కథ అయితే నెక్ట్స్‌ లెవల్‌. ఇది రెండు పార్టులుగా వస్తుంది. తొలిపార్ట్‌ వచ్చే ఏడాది ఏప్రిల్‌ 18న విడుదల అవుతుంది. ఓ చారిత్రాత్మక నేపథ్యం చుట్టూ తిరిగే ఈ కథను కార్తీక్‌ అద్భుతంగా మలిచాడు అని తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UULmVdT0LRtF67ZbuX2dEeQQ&layout=gallery[/embedyt]