Skip to main content

Namaste NRI

ఎలాన్ మాస్క్ పై ప్రమీలా జయపాల్ విమర్శలు

సంపన్నులపై ఎంత పన్ను వేయాలనేది ఇప్పుడు అమెరికాలో హాట్‌ టాపిక్‌గా మారింది. టెక్‌ ఆంత్రప్రెన్యూర్‌ ఎలాన్‌ మస్క్‌.. తాను అమెరికా చరిత్రలో ఎవ్వరూ కట్టనంత ట్యాక్స్‌ కట్టబోతున్నానని ప్రకటించారు. ఆ తరువాత 11 బిలియణ్‌ డాలర్ల ట్యాక్స్‌ చెల్లించినట్టు ఆయన తెలిపారు. దీంతో ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన వ్యక్తి చెల్లించే పన్ను గురించి ఆసక్తికర చర్చ నడిరచింది. అయితే  దీనిపై భారతీయ సంతతి వ్యక్తి, అమెరికా ప్రతినిధుల సభ సభ్యురాలు ప్రమీల జయపాల్‌ స్పందించారు.  పన్నుల చెల్లింపుపై  గొప్పలకు పోతున్నారా? అంటూ ఆమె ఎలన్‌ మస్క్‌ను నిలదీశారు. పన్నుల చెల్లింపు విషయంలో గప్పాలు కొట్టుకోవద్దు, ఆ చెల్లించేది సరైన పన్నులు కావనేది అందరికి తెలుసు అని ఆమె పేర్కొన్నారు. ఒక్క రోజులోనే 36 బిలియన్‌ డాలర్లను సంపాదిస్తున్న ఎలాన్‌ మస్క్‌ 11 బిలియన్‌ డాలర్ల ట్యాక్స్‌ చెల్లించానంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు. కరోనా సంక్షోభం ప్రారంభమైన నాటి నుంచీ ఆయన సంపద 270 బిలియన్‌ డాలర్ల మేర పెరిగింది అంటూ ఆమె స్పందించారు.

Social Share Spread Message

Latest News