Skip to main content

Namaste NRI

తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో ఉగాది పుర‌స్కారాల ప్రదానం

అమెరికాలోని న్యూజెర్సీలో తెలుగు కళాసమితి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు, పురస్కారాల ప్రదానోత్సవం వైభవంగా జ‌రిగింది. ఈ కార్యక్రమం తెలుగు కళాసమితి అధ్యక్షుడు మధుసూధనరావు అన్నా ఆధ్వర్యంలో జ‌రిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా పద్మభూషణ్ అవార్డు గ్రహీత డా.నోరి దత్తాత్రేయుడు, ఉపేంద్ర చివుకుల, గుంటూరు మిర్చియార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు, సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్ విచ్చేశారు. తెలుగు కళాసమితి అధ్యక్షులు మధు అన్నా మాట్లాడుతూ తెలుగుకళా సమితి ఆశయాలు, విలువల గురించి ప్రస్తావిస్తూ తనకు దక్కిన రెండు సంవత్సరాల సేవను ఎంతో సంతోషంగా, బాధ్యతగా నిర్వహించానన్నారు. మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ తెలుగువారి సంస్కృతిని, వారసత్వ సంపదను టీఎఫ్ఏఎస్ పరిరక్షిస్తున్నందుకు కార్యవర్గ సభ్యులను అభినందించారు. ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ మాతృభాషను విస్మరించిన ఏ జాతి మనుగడను సాగించలేదన్నారు.

ఈ సందర్భంగా నోరి దత్తాత్రేయుడు మాట్లాడుతూ భాషే సాంస్కృతిక వారధి అని అన్నారు. ఒక జాతి అస్తిత్వం, ప్రత్యేకతను చాటిచెప్పేది మాతృభాషేనని తెలిపారు. తెలుగువారి సమక్షంలో ఈ ఉగాది పురస్కారం అందుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు ఇద్దరూ వైద్య ఆరోగ్య రంగానికి ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమించారని తెలిపారు. టీఎఫ్ఏఎస్ మాజీ అధ్యక్షులు దాము గేదెల సేవలను గుర్తించి జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఫోటో ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. కోకిల మంజులశ్రీ పంచాంగ శ్రవణం చేశారు. చిట్టి శర్మ వేద పఠనం చేశారు.

ఈ కార్యక్రమంలో 2024-26 టీఎఫ్ఏఎస్ కార్యవర్గ సభ్యులైన సత్య వెంకటతాతా, ప్రసాద్ ఊటుకూరి, వాణి కూనిశెట్టి, శేషగిరిరావు కంభంనెట్టు, అరుంధతి శావెల్లి, వరలక్ష్మి రాధాకృష్ణ, లత మాదిశెట్టి, లోకేందర్ గిర్కల పాల్గొన్నారు. స్వర సామ్రాట్, డా.టీ శరత్ చంద్ర, రంగస్థల కళాకారులు అశోక్ చింతకుంటలను ఉగాది పురస్కారాలతో సత్కరించారు. 2026-28కి అధ్యక్షురాలిగా ఎన్నికైన ఉమా మాఖం, 8 మంది కార్యవర్గ సభ్యులతో సుధాకర్ ఉప్పల ప్రమాణ స్వీకారం చేయించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events