Namaste NRI

భారతీయ అమెరికన్ కు ప్రతిష్టాత్మక అవార్డు

ప్రముఖ భరతీయ అమెరికన్‌ గణిత శాస్త్రవేత్త నిఖిల్‌ శ్రీవాస్తవకు అరుదైన అవార్డు దక్కింది. 1959 నాటి గణితశాస్త్ర సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్న నేపథ్యంలో శ్రీవాస్తకు సిప్రియాన్‌ ఫోయాస్‌ ప్రైజ్‌కు ఎంపికయ్యారు. అపరేటర్‌ థియేరీలో అమెరికన్‌ మాథ్యమటికల్‌ సొసైటీ ఈ అవార్డును అందజేయనుంది. ప్రస్తుతం కాలిఫోర్నియా యూనివర్సిటీలో నిఖిల్‌ శ్రీవాస్తవ భోధన వృత్తిలో ఉన్నారు. సిప్రియాన్‌ అవార్డును గెలిచిన వారిలో నిఖిల్‌తో పాటు ఆడమ్‌ మార్కస్‌, డానియల్‌ స్పిల్‌మ్యాన్‌ ముగ్గురికి కలిసి ఈ అవార్డును సంయుక్తంగా ప్రకటించారు. అవార్డులో భాగంగా వీరికి రూ.3.76 లక్షలు ( 5,000 డాలర్లు) లభించనున్నాయి.

                 వచ్చే ఏడాది జనవరి 5వ తేదీన జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును అందజేయనున్నట్టు అమెరికన్‌ మాథ్యమటికల్‌ సొసైటీ తెలిపింది. గణితశాస్త్రంలో నిఖిల్‌ శ్రీవాస్తవ ప్రైజ్‌లు గెలవడం చాలా కామన్‌. ఆ రంగంలో ఆయనకు ఇది మూడో అతిపెద్ద అవార్డు. గతంలో 2014లో జార్జ్‌ పోలియా ప్రైజ్‌, 2021లో హెల్డ్‌ ప్రైజ్‌లను కూడా నిఖిల్‌ గెలుచుకున్నారు. ఆపరేటర్‌ థియరీలో రిచర్డ్‌ కడిసన్‌, ఇసడోర్‌ సింగర్‌ 1959 విసిరిన ప్రశ్నకు నిఖిల్‌ పరిష్కారాన్ని కనుగొన్నాడు.

Social Share Spread Message

Latest News