Namaste NRI

హైదరాబాదీ సంస్థకు ప్రతిష్ఠాత్మక కాంట్రాక్ట్

హైదరాబాద్‌కు చెందిన ఆజాద్‌ ఇంజినీరింగ్‌ సంస్థ ప్రతిష్ఠాత్మక కాంట్రాక్ట్‌ను దక్కించుకున్నది. విమానయాన పరిశ్రమలో వినియోగించే సూపర్‌ క్రిటికల్‌ రొటేటింగ్‌ విడిభాగాలను కంపెనీ తయారు చేస్తున్నది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ విమానయాన దిగ్గజ సంస్థ బోయింగ్‌ నుంచి కీలక విమాన విడిభాగాల తయారీ, సరఫరా కోసం ఆజాద్‌కు ఆర్డర్‌ వచ్చింది. ఈ మేరకు ఆజాద్‌ ఇంజినీరింగ్‌ ప్రకటించింది. గడిచిన కొన్నేండ్లుగా సంస్థ సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందింది. ఖచ్చితత్వంతో కూడిన నాణ్యమైన, సురక్షితమైన విడిభాగాలను అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఆర్డర్లను పొందుతూ పరిశ్రమలో నమ్మకాన్ని సంపాదించింది. ఈ నేపథ్యంలోనే బోయింగ్‌ నుంచి కాంట్రాక్ట్‌ సొంతం చేసుకున్నది.

                వచ్చే ఏడాది తొలి త్రైమాసికం నుంచి బోయింగ్‌కు హైడ్రాలిక్‌, మెకానికల్‌  ఫిట్టింగ్స్‌ తదితర కీలక విడిభాగాల సరఫరాను ప్రారంభిస్తామని ఆజాద్‌ ఇంజనీరింగ్‌ తెలిపింది. టర్బైన్‌, ఏరోస్పేస్‌ ఇండస్ట్రీ కోసం క్లిష్టమైన, అత్యంత కీలకమైన విడిభాగాలు, యాంత్రిక పరికరాలను తయారుచేసే సామర్థ్యం ఆజాద్‌ ఇంజినీరింగ్‌కు ఉందని ఈ సందర్భంగా కంపెనీ వర్గాలు గుర్తు చేశాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events