మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో ఇటీవల శివాజీ విగ్రహం కూలడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పారు. ఛత్రపతి శివాజీ కేవలం ఒక పేరు లేదా ఒక చక్రవర్తి కాదు. మనకు ఆయన ఒక దైవం. ఇవాళ నేను నా శిరస్సును నా దైవం పాదాల ముందు వంచి క్షమాపణ అడుగుతున్నా అని మోదీ అన్నారు. మహారాష్ట్రలోని పాల్‌ఘర్ జిల్లాలో రూ.76 వేల కోట్లతో చేపట్టిన వంధన్ నౌకాశ్రయ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.