Namaste NRI

కోర్ట్‌ లో ప్రియదర్శి.. క్లాప్ కొట్టిన నాని

ప్రియదర్శి ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం కోర్ట్‌ – స్టేట్‌ వర్సెస్‌ ఏ నోబడీ. రామ్‌జగదీశ్‌ దర్శకుడు. ప్రశాంతి త్రిపురనేని నిర్మాత. హీరో నాని ఈ సినిమాకు సమర్పకుడు. ఈ సినిమా హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో నాని క్లాప్‌ కొట్టగా, నిర్మాత ప్రశాంతి కెమెరా స్విచాన్‌ చేశారు. జెమినీ కిరణ్‌ గౌరవ దర్శకత్వం వహించారు.

Mayfair 151

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన టైటిల్‌ పోస్టర్‌ బోనులో న్యాయదేవత, శాంతి చిహ్నాలుగా ఎగురుతున్న పావురా లతో ఆసక్తికరంగా ఉంది. అన్యాయంగా ఓ కేసులో ఇరుక్కున్న కుర్రాడికోసం జరిగే న్యాయపోరాటం చుట్టూ ఈ కథ నడుస్తుందని, ప్రియదర్శి ఇందులో లాయర్‌గా నటిస్తున్నాడనీని మేకర్స్‌ తెలిపారు. సెప్టెంబర్‌ లో రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు కానున్న ఈ సినిమాలో శివాజీ, సాయికుమార్‌, రోహిణి, హర్షవర్థన్‌, హర్ష్‌రోషన్‌, శ్రీదేవి ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: దినేష్‌ పురుషోత్తమన్‌, సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌, నిర్మాణం: వాల్‌పోస్టర్‌ సినిమా.

Ixora 152
Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events