Skip to main content

Namaste NRI

వారణాసి డబ్బింగ్ పై క్లారిటీ ఇచ్చిన ప్రియాంక చోప్రా

గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా, తాను నటిస్తున్న భారీ చిత్రం వారణాసి లో తన పాత్రకు తెలుగులో స్వయంగా డబ్బింగ్ చెప్పనున్నట్లు స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఈ విషయాన్ని ఆమె ధృవీకరించారు. తెలుగు ప్రేక్షకులపై ఉన్న అభిమానంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ప్రకటనతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌బాబు కథానాయకుడిగా రూపొందుతున్న ఈ గ్లోబల్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఓవైపు షూటింగ్‌తో పాటు సమాంతరంగా పోస్ట్‌ప్రొడక్షన్‌ వర్క్‌ని కూడా పూర్తిచేస్తున్నారు దర్శకుడు రాజమౌళి. ఈ నేపథ్యంలో సొంత డబ్బింగ్‌ కోసం ప్రియాంకచోప్రా సిద్ధమవుతున్నదని, ఓ ట్యూటర్‌ సహాయంతో తెలుగుపై పట్టుసాధించేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నదని తెలిసింది. దర్శకుడు రాజమౌళి సైతం ప్రియాంకచోప్రాను ఓన్‌ డబ్బింగ్‌ కోసం ప్రోత్సహిస్తున్నారట. అన్నీ కుదిరితే ఆమెతోనే డబ్బింగ్‌ చెప్పించే ఛాన్స్‌ ఉందని ఇన్‌సైడ్‌ టాక్‌. వారణాసి చిత్రంలో మందానికి అనే పాత్రలో ప్రియాంకచోప్రా కనిపించనుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events