జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఎన్టీఆర్ 31 గా రాబోతుంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ గాసిప్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్‌లో మెరువబోతుందన్న వార్త నందమూరి అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతోంది. నెక్ట్స్ పాన్ ఇండియా స్థాయిలో ఉండబోతున్న ఎన్టీఆర్ 31లో మరో బీటౌన్ బ్యూటీ కనిపించనుందన్న అప్‌డేట్ ఇండస్ట్రీ సర్కిల్‌లో ఇంట్రెస్టింగ్‌గా మారింది.

సిటడెల్ లాంటి హాలీవుడ్ ప్రాజెక్ట్ చేసినా అక్కడ అంత పాపులారిటీ సంపాదించుకోలేకపోయిన ప్రియాంక, మళ్లీ భారతీయ సినిమాల్లో అవకాశం కోసం చూస్తున్నప్పటికీ పెద్దగా ఆఫర్లేమి రావడం లేదట. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియాంకా చోప్రా పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న ఎన్టీఆర్ 31లో నటిస్తే మాత్రం సక్సెస్‌ఫుల్‌గా హోం ఇండస్ట్రీ (బాలీవుడ్)కి రీఎంట్రీ ఇవ్వడమే కాకుండా ఇంటర్నేషనల్ స్టార్‌డమ్‌ను కూడా పదిలంగా కాపాడుకోవచ్చని తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.

గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమాలు సత్తా చాటుతుండటంతో ఇటీవల కాలంలో బాలీవుడ్ యాక్టర్లు తెలుగులో సినిమాలు చేసేందుక ఆసక్తి చూపుతున్నారు. ఒకవేళ అన్నీ అనుకున్నట్టుగా కుదిరి ఎన్టీఆర్ 31కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ప్రియాంకా చోప్రాకు మాత్రం కెరీర్ బూస్ట్ సినిమా అవుతుందనడటంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు ట్రేడ్ పండితులు.















