Skip to main content

Namaste NRI

బాలీవుడ్ లోకి ప్రియాంకా చోప్రా భర్త ?

బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా, అమెరికన్‌ సింగర్‌ నిక్‌ జోనస్‌ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఇండియాకు దూరమైన విషయం తెలిసిందే  తన భర్త నిక్‌ జోనస్‌ అండ్‌ ఫ్యామిలీతో అమెరికాలో ఆనందకర క్షణాలను గడుపుతోంది. తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. బాలీవుడ్‌ తార ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లోనూ తన పాగా వేసిన సంగతి తెలిసిందే. యాక్షన్‌ సిరిస్‌ క్యాంటికో తో ఇంగ్లీష్‌ చిత్ర పరిశ్రమకి పరిచయమైన ఈ భామ మంచి గుర్తింపు సాధించి అక్కడ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తాజాగా ప్రియాంక బాటలోనే భర్త నిక్‌ జోనాస్‌ సైతం సాగుతున్నట్లు అనిపిస్తోంది. నాకు బాలీవుడ్‌ అంటే ఎంతో ఇష్టమని నిక్‌ జోనాస్‌ అన్నారు. ప్రియాంకతో పెళ్లి తర్వాత వాటితో నాకు కనెక్షన్‌ ఎక్కువగా పెరిగింది. నాకు అక్కడ ఎంతో మంది మంచి స్నేహితులు ఉన్నారు. వారు పడే కష్టం నన్ను ఎంతో ఇన్‌స్పైర్‌ చేస్తుంది. మంచి ఆఫర్‌ వస్తే అక్కడి సినిమాల్లో నటిస్తానేమో? అంటూ ఈ అమెరికన్‌ సింగర్‌ చెప్పుకొచ్చాడు. దీంతో త్వరలోనే నిక్‌ సైతం ప్రియాంకని ఫాలో అవుతూ హిందీ సినిమాలు చేసే అవకాశం ఉందని సినీ జనాలు చర్చించుకుంటున్నాయి. మరి నిక్‌ జోనస్‌ బాలీవుడ్‌ తెరంగేట్రం ఎలాంటి సినిమాతో ఉండబోతుందో చూడాలి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events