దేశీ హోమ్స్ ప్రాపర్టీ షో 2021 మూడవ ఎడిషన్ ఈసారి దుబాయ్‌లో ప్రారంభం కానుంది. అక్టోబర్ 21 నుంచి 23 వరకు హోటల్ లే మెరిడియన్‌లో జరగనుంది. సినర్జీ ఆఫ్ సర్వీసెస్ నైట్‌లైఫ్, థియా ఎంటర్ ప్రైజ్ ఇండియా కంపెనీలు సంయుక్తంగా ఈ ప్రాపర్టీ షోను నిర్వహిస్తున్నాయి. దేశంలోని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఈ షో లో పాల్గొననున్నాయని.. వ్యక్తిగత గృహాలు, విల్లాలు, అపార్ట్‌మెంట్లు, ఓపెన్ ప్లాట్లు, పామ్‌హౌస్‌లు వంటి అన్ని రకాల ప్రాపర్టీలులో ఈ ప్రదర్శనలో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. మాడ్యులర్ ఫర్నిచర్ సప్లయర్స్, సెక్యూరిటీ సిస్టమ్స్, ఇంటీరియల్ డిజైనర్స్ కూడా ఈ షోలో పాల్గొంటున్నాయి. ప్రాపర్టీ షో నిర్వహణలో అన్ని రకాల భద్రత చర్యలను తీసుకుంటూ, కరోనా నిబంధనలు తు.చ. తప్పకుండా పాటిస్తున్నామని ఎస్‌ఓఎస్ నైట్‌లైఫ్ ఫౌండర్ అండ్ ఎండీ చంద్ సేథ్ తెలిపారు.