Skip to main content

Namaste NRI

పక్కా కమర్షియల్‌ ట్రైలర్‌ డేట్‌ ఫిక్స్‌

గోపీచంద్‌, రాశీఖన్నా హీరో హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం పక్కా కమర్షియల్‌. జీఏ2 పిక్చర్స్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం జూలై 1న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను గోపీచంద్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 12న కర్నూలులో జరిగే వేడుకలో రిలీజ్‌ చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఈ మేరకు ఓ చిన్న వీడియో గ్లింప్స్‌ను సినీ ప్రియులతో పంచుకున్నారు. అందులో గోపీచంద్‌ న్యాయవాదిగా స్టైలిష్‌ లుక్‌లో కనిపించారు. మారుతి శైలి వినోదంతో పాటు గోపీచంద్‌ నుంచి కోరుకునే యాక్షన్‌ అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. రాశి ఖన్నా ఓ సరికొత్త పాత్రలో వినోదాలు పంచనుంది. టైటిల్‌కు తగ్గట్లుగా పక్కా కమర్షియల్‌ సినిమా ఇది అని చిత్ర వర్గాలు తెలిపాయి. జేక్స్‌ బిజాయ్‌ స్వరాలందించారు. రవీందర్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌గా, కమర్‌ చావ్లా ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు.

Social Share Spread Message

Latest News