Skip to main content

Namaste NRI

పుష్ప- 2 ప్రారంభం

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన పుష్స. ది రైజ్‌ మంచి హిట్‌ అయింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా పుష్స ది రూల్‌ ఆరంభమైంది. తొలి షాట్‌కి మారిశెట్టి ప్రసాద్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, శ్రీమాన్‌ క్లాప్‌ కొట్టారు. తోట శ్రీనివాస్‌ గౌరవ దర్శకత్వం వహించారు. వీరు ముగ్గురూ సుకుమార్‌ అసోసియేట్‌ డైరెక్టర్లు కావడం విశేషం. రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. ఫహద్‌ ఫాజిల్‌, ధనుంజయ్‌, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌ తదితరులు నటిస్తున్నారు. సుకుమార్‌ రైటింగ్స్‌, మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ ఆరంభం కానుంది. ఈ కార్యక్రమంలో చెర్రీ, రవిశంకర్‌, సుకుమార్‌, తబిత తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, ఛాయాగ్రహణం: మిరోస్లా క్యూబా బ్రోజెక్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌ : ఎస్‌.రామకృష్ణ, మోనిక నిగొత్రే, పాటలు: చంద్రబోస్‌.

Social Share Spread Message

Latest News