Skip to main content

Namaste NRI

ఖతర్‌ గుడ్‌న్యూస్‌.. పర్యాటకుల కోసం

పర్యాటకులకు గల్ఫ్‌ దేశం ఖతర్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. దేశంలో ఆరోగ్య సంరక్షణ సేవలను క్రమబద్ధీకరించేందుకు 2021లో తీసుకొచ్చిన చట్టం నం.22లోని నిబంధనలకు అనుగుణంగా సందర్శకులు, పర్యాటకులకు బీమా కోసం ప్యాకేజీ విషయమై ప్రజారోగ్య శాఖ చేసిన  ప్రతిపాదనను కేబినెట్‌ ఆమోదించింది.  ప్రత్యేకంగా పర్యాటకుల కోసం ఆరోగ్య  బీమా ప్యాకేజీలను ఖతర్‌ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆ దేశ ప్రధాని అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్‌ ఖలీద్‌ బబిన్‌ ఖలీపా బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ అల్‌ థానీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Social Share Spread Message

Latest News