Skip to main content

Namaste NRI

రాజశేఖర్‌ కథానాయకుడిగా మాన్‌స్టర్‌ ప్రారంభం

రాజశేఖర్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం మాన్‌స్టర్‌.  పవన్‌ సాదినేని దర్శకుడు. మల్కాపురం శివకుమార్‌ నిర్మిస్తున్నారు. తొలి సన్నివేశానికి నిర్మాతలు దామోదర్‌ ప్రసాద్‌, ప్రసన్న కుమార్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, డైరెక్టర్‌ ప్రవీణ్‌ సత్తారు క్లాప్‌ కొట్టారు. రాజశేఖర్‌, నిర్మాతలు బెక్కం వేణు గోపాల్‌, శివకుమార్‌ కలిసి దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందజేయగా, డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ ఫష్ట్‌ షాట్‌కి దర్శకత్వం వహించారు. ఇంటెన్స్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులు, గ్యాంగ్‌స్టర్ల మధ్య ఇరుక్కున్న మాన్‌స్టర్‌ కథ ఇది అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ కార్యక్రమంలో జీవిత, శివాని, రాజ్‌తరుణ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం : ఎం. జిబ్రాన్‌, ఛాయాగ్రహణం: వివేక్‌ కాలేపు, కూర్పు: విప్లవ్‌ నైషధం, సంభాషణలు: రాకేందు మౌళి, ప్రొడక్షన్‌ డిజైన్‌: శ్రీనివాస్‌ నార్ని.

Social Share Spread Message

Latest News