Skip to main content

Namaste NRI

రక్షిత్‌శెట్టి సప్త సాగరాలు దాటి

రక్షిత్‌శెట్టి, రుక్మిణి వసంత్‌ నటించిన కన్నడ చిత్రం సప్త సాగర దాచే ఎల్లో చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ తెలుగులో సప్తసాగరాలు దాటి పేరుతో విడుదల చేయబోతున్నది. కన్నడంలో విజయవంతమైన ఈ చిత్రానికి హేమంత్‌ ఎం రావు దర్శకత్వం వహించారు. క్లాసిక్‌ లవ్‌స్టోరీగా ఈ చిత్రం ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. ఈ సినిమా తెలుగు డబ్బింగ్‌ వెర్షన్‌ను ఈ నెల 22న విడుదల చేయబోతున్నట్లు పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రకటించింది. కన్నడ తరహాలోనే తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆదరిస్తారనే నమ్మకం ఉందని నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ తెలిపారు.

Social Share Spread Message

Latest News