Skip to main content

Namaste NRI

రామ్‌, బోయపాటి మూవీ షురూ

రామ్‌ పోతినేని హీరోగా, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో సినిమాకు ముహూర్తం కుదిరింది. ఈ సినిమా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ కెమెరా స్విఛాన్‌ చేయగా, నిర్మాత స్రవంతి రవికిషోర్‌ క్లాప్‌ నిచ్చారు. దర్శకులు లింగుస్వామి, వెంకట్‌ ప్రభు స్క్రిప్ట్‌ అందజేశారు. ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ మా సంస్థలో నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రమిది. భారీ బడ్జెట్‌, పాన్‌ ఇండియా మూవీగా అత్యున్నత సాంకేతిక విలువతో నిర్మిస్తున్నాం. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తాం అన్నారు.  పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాస సిల్కర్‌ స్క్రీన్స్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీలో  పాన్‌ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు. ఈ  చిత్రానికి సమర్పణ: పవన్‌కుమార్‌.

Social Share Spread Message

Latest News