Skip to main content

Namaste NRI

కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ లో రామ్ చ‌ర‌ణ్ స్పెషల్ అప్పీయరెన్స్

సల్మాన్ ఖాన్ హీరోగా  నటిస్తున్న తాజా చిత్రం కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన బతుకమ్మ పాటకు అద్భుత ఆదరణ లభించిన విషయం తెలిసిందే. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ పాటను అందంగా దృశ్యమానం చేశారు. ఇదిలా వుండగా ఈ సినిమాలోని ఓ పాటలో తెలుగు అగ్ర హీరో రామ్ చరణ్ స్పెషల్ అప్పీయరెన్స్ ఇవ్వబోతున్నారని వార్తలొచ్చాయి. దీంతో అభిమానులు ఆ పాట ఎలా ఉంటుందోనని ఆతృతగా ఎదురుచూశారు. ఈ గీతాన్ని విడుదల చేశారు. ఏంటమ్మా అంటూ తెలుగు పల్లవితో మొదలైన ఈ పాటలో సల్మాన్ఖాన్, వెంకటేష్, రామ్ చరణ్ కలిసి స్టెప్పులేయడం ప్రధానాకర్షణగా నిలిచింది. తెలుగు, హిందీ లిరిక్స్ కలబోతగా ఈ పాట సాగింది. మధ్యలో వచ్చే ఈ రోజు వేడుకగా ఉంటుంది అనే తెలుగు చరణాలు ఆకట్టుకున్నాయి.

చెన్నై ఎక్స్ప్రెస్ లోని లుంగీ డ్యాన్స్ను స్ఫురిస్తూ ఈ పాట సాగింది. పసుపు అంగీ, తెలుపు లుంగీ ధరించి రామ్ చరణ్ చివర్లో వేసిన స్టెప్స్ హైలైట్గా నిలిచాయి. ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఇద్దరు లెజెండరీ నటులతో కలిసి స్టెప్పులేయడం ఓ మధురానుభూతి అంటూ రామ్చరణ్ ఈ పాట గురించి ట్విట్టర్లో ఆనందం వ్యక్తం చేశారు. ఈ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events