Skip to main content

Namaste NRI

ఇరుదేశాల మధ్య తొందర్లోనే సంబంధాలు :  బైడెన్

అమెరికా, చైనా మధ్య సంబంధాలను సిగ్గుచేటు బెలూన్ బాగా దెబ్బతీసిందని అమెరికా  ప్రెసిడెంట్ బైడెన్ తెలిపారు. జి 7 సదస్సు నేపథ్యంలో బైడెన్ మాట్లాడారు. ఇప్పటి ప్రతిష్టంభన ఏదో విధంగా వీడుతుందేమో, వేచి చూడాల్సి ఉందని అని తెలిపారు. తొందర్లోనే సంబంధాలు మెరుగుపడుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. అనుమానిత  చైనా స్పై బెలూన్‌ను అమెరికా సేనలు ఈ ఏడాదిలోనే కూల్చివేశాయి. ఫిబ్రవరిలో అమెరికా గగనతలంపై ఎగిరిన అనుమానాస్పద బెలూను అమెరికా నిఘా కార్యక్రమాల్లో భాగం అని భావించి తరువాత దీనిని కూల్చివేయడం దౌత్య సంబంధాలు దెబ్బతినే స్థితికి దారితీసింది. ఇప్పుడు ఇరుదేశాల మధ్య దౌత్య ప్రక్రియకు ఉపకరించే హాట్‌లైన్ నిలిపివేతకు గురైంది. దీనిని పునరుద్ధరించే అవకాశం ఉందని బైడెన్ తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events