Namaste NRI

భారత సంతతికి చెందిన పౌరులకు అరుదైన గౌరవం!

భారత సంతతి చెందిన కెనడా పౌరులకు అరుదైన గౌరవం దక్కింది. పిల్లల వైద్యుదు డాక్టర్‌ ప్రదీప్‌ మర్చంట్‌,  ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్‌ వైకుంఠం అయ్యర్‌ లక్ష్మణన్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి బాబ్‌ సింగ్‌ దిల్లాన్‌ (నవ్‌జీత్‌ సింగ్‌ దిల్లాన్‌)  ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ది ఆర్డర్‌ ఆఫ్‌ కెనడా అవార్డును అందుకున్నారు. సమాజానికి, దేశానికి విశేషంగా కృషి చేసిన వారికి ఈ అవార్డును కెనడా ప్రభుత్వం అందజేస్తుంటుంది. ఈ ఏడాది 135 మందికి ఈ పురస్కారానికి ఎంపిక చేయగా, వారిలో ఈ ముగ్గురూ ఉన్నారు.

                        ఒంటారియోలోని గ్రీలీ ప్రాంతానికి చెందిన మర్చంట్‌ పిల్లల వైద్యుడిగా వైద్య రంగంలో విశేషంగా కృషి చేయడంతోపాటు భారత్‌, కెనడా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తున్నారు. అలాగే బాబ్‌ దిల్లాన్‌ మెయిన్‌ స్ట్రీట్‌ ఈక్విటీ కార్పొరేషన్‌ పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. టోరంటో స్టాక్‌ ఎక్స్ఛేంజీలో లిస్ట్‌ అయిన తొలి సిక్కులకు చెందిన కంపెనీ ఇదే కావడం విశేషం. ఒంటారియోలోని మిస్సిసాగాకు చెందిన వైకుంఠ అయ్యర్‌ లక్ష్మణన్‌కు శాస్త్రవేత్తగా హైడ్రోమెటలర్జీలో ఉన్న నైపుణ్యం సమాజానికి ఎంతో ఉపయోగపడుతోంది. ఆయన వ్యాపారాల ద్వారా వచ్చే ఆదాయంలో కొంతమేర సమాజం శ్రేయస్సు కోసం విరాళంగా అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి ఈ పురస్కారం అందించినట్లు కెనడా ప్రభుత్వం తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events