Skip to main content

Namaste NRI

షూటింగ్‌లో గాయపడ్డ రష్మిక మందన్న

టాలీవుడ్‌ను గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలువురు హీరోలు అనుకోకుండా ఆస్పత్రి పాలవ్వగా.. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా గాయపడింది. మైసా, రణబాలి చిత్రాలతో బిజీగా ఉన్న రష్మిక షూటింగ్‌లో యాక్షన్, నృత్య సన్నివేశాలు తెరకెస్తుండగా తీవ్రంగా గాయపడింది. సత్వరం చికిత్స అందించి, ఆమెకు పూర్తిగా ఆరు వారాలు విశ్రాంతి సూచించారు డాక్టర్లు. దాంతో, తెలుగింటి కోడలు కొన్ని వారాలు షూటింగ్‌కు దూరం కానుంది.

గీతగోవిందం, పుష్ప, గర్ల్‌ఫ్రెండ్ ఫేమ్ రష్మిక మందన్నా షూటింగ్ సమయంలో గాయపడింది. మైసా, రణబాలి చిత్రాల కోసం కష్టమైన యాక్షన్, నృత్య సన్నివేశాలు తీస్తుండగా రష్మిక గాయపడింది. దాంతో, వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. రష్మికను పరీక్షించిన వైద్యులు గాయం తీవ్రత పెద్దదేనని, కనీసం ఆరువారాలు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events