Skip to main content

Namaste NRI

రియల్ దండుపాళ్యం ట్రైలర్ లాంచ్…

రాగిణి ద్వివేది, మేఘన రాజ్‌ ప్రధాన పాత్రల్లో మహేష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రియల్‌ దండుపాళ్యం. రామ్‌ ధన్‌ మీడియా వర్క్స్‌ సమర్పణలో శ్రీ వైష్ణోదేవి పతాకంపై సి.పుట్టస్వామి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న తెలుగు, కన్నడ భాషల్లో విడుదలువుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ని నిర్మాత సురేష్‌ కొండేటి విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ దండుపాళ్యం సిరీస్‌ తెలుగు, కన్నడ భాషల్లో ఎంత ఆదరణ దక్కించుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు వాటన్నింటికీ మించేలా రియల్‌ దండుపాళ్యం ఉండనుంది. మగాళ్ల వంచనకు గురైన ఐదుగురు అమ్మాయిల కథే ఈ చిత్రం. ప్రతి సన్నివేశాన్ని ఎంతో రియలిస్ట్‌గా తెరకెక్కించారు దర్శకుడు మహేష్‌. ఈ చిత్రం ప్రస్తుతం జరుగుతున్న ఎన్నో సంఘటనలకు అద్దం పట్టేలా ఉంటుంది అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత : కోయల్‌ బంజార.

Social Share Spread Message

Latest News