Namaste NRI

లేడీ ఓరియెంటెడ్‌ మూవీతో రెజీనా

టెన్త్‌క్లాస్‌, పెళ్లికి ముందు ప్రేమకథ, రాజరాజ చోర చిత్రాల్లో నటించిన హీరోయిన్‌ సునైన ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన చిత్రం రెజీనా. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ నాయికా ప్రధానంగా సాగే సైల్టిష్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. ప్రవాహానికి ఎదురీదే చేపలాగా ఒక సాధారణ గృహిణి అసాధారణమైన పనిని ఎలా చేసిందనేది ఆసక్తికరం. ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించే కథ, కథనాలు, రెజీనా పాత్ర ప్రయాణం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయన్నారు. డొమిన్‌ డిసిల్వా  దర్శకుడు. ఎల్లో బేర్‌ ప్రొడక్షన్‌ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై సతీష్‌ నాయర్‌ నిర్మాత. తమిళంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు, మలయాళం, హిందీ భాషల్లోనూ విడుదల కానుందని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం : సతీష్‌ నాయర్‌, ఛాయాగ్రహణం: కె.పవన్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events