జమ్ముకశ్మీరులోని అమరలింగేశ్వరుని దర్శించుకోవాలనుకునే భక్తులకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన 540 శాఖలు ఈ ప్రక్రియను ప్రారంభించాయి. అమర్‌నాథ్ యాత్ర జూన్ 29నుంచి ఆగస్టు 19 వరకు 52 రోజులపాటు జరుగుతుంది. సముద్ర మట్టం నుంచి 3,880 మీటర్ల ఎత్తులోని మంచు కొండల్లో అమరలింగేశ్వరుడు కొలువై ఉన్న సంగతి తెలిసిందే. అమరనాథ్ దేవస్థానం బోర్టు ఈ యాత్రకు ఏర్పాట్లు చేస్తుంది. దక్షిణ కశ్మీరులోని అనంత్‌నాగ్‌లో ఉన్న పహల్గామ్ మీదుగా 48 కిలోమీటర్లు ప్రయాణించి అమర్‌నాథ్‌కు చేరుకోవచ్చు. మధ్య కశ్మీరులోని గండేర్‌బల్ జిల్లాలో ఉన్న గండేర్‌బల్ మార్గంలో 14 కి.మీ. ప్రయాణించి కూడా అమరలింగేశ్వరుని దర్శించుకోవచ్చు.