బ్రిటన్‌లో కొత్తగా ఏర్పడ్డ అధికార లేబర్ పార్టీ అక్కడి భారతీయులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. తమ బంధువులను కుటుంబ వీసాపై బ్రిటన్‌కు తీసుకొచ్చేందుకు ఉన్న నిబంధనలపై కొత్త ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వార్షిక ఆదాయ పరిమితిని పెంచుతూ రిషి సునాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పక్కన పెట్టింది. దీంతో బ్రిటన్‌లో శాశ్వత నివాస హోదా కలిగిన ప్రవాస భారతీయులకు భారీ ఊరట లభించింది. వీరి కుటుంబ ఆదాయ పరిమితిని 29 వేల పౌండ్ల నుంచి 38 వేల పౌండ్ల(రూ.41.5లక్షలు)కు రిషి సునాక్ ప్రభుత్వం పెంచగా, ఈ నిబంధనను అధికార లేబర్ పార్టీ పక్కనపెట్టింది. ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా పక్కన పెడుతున్నామని బ్రిటన్ హోం మంత్రి యెవెట్ కూపర్ పేర్కొన్నారు. ఈ విధానాన్ని వలసవాద సలహా కమిటీతో సమీక్షించనున్నారు.